టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసిందేమీ లేదని అన్నారు.
హుదూద్ తుఫాను వచ్చిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత కష్టపడ్డారో అందరూ చూశారని పేర్కొన్నారు.ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ బ్రోతల్ హౌస్ గా మార్చేశారని ఆరోపించారు.
ఇక యూనివర్సిటీ వీసీ చాంబర్ కార్యాలయాన్ని…వైసీపీ కార్యాలయంగా మార్చారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.ఏ2 విజయసాయిరెడ్డి పదివేల కోట్లు దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి ఎంత దోచుకున్నారో… వాటిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు.ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రానికి దెబ్బేస్తున్నాయని అన్నారు.గతంలో అమరావతి రాజధాని అని చెప్పిన జగన్..
ఇప్పుడు మూడు రాజధానులన్నీ తీసుకున్న నిర్ణయంపై అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. ఇటువంటి నాయకులా…మాకు నీతులు చెప్పేది అని మండిపడ్డారు.