మనం ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం.టీవీ చూసే ప్రేక్షకుల సంఖ్య అలాగే సినిమా థియేటర్ లో చూసే వారి సంఖ్య ఘననీయంగా పడిపోయింది.
దానిని నిజం చేస్తూ ఇప్పుడు పలు టీవీ షోలలో కామెడీ పేరు తో చేస్తున్న రియాలిటీ షో లు అతి తక్కువ టిఆర్పి రేటింగ్ తో పాకుతూ ఉండటం విశేషం.ఎదో ఒక షో బాలేదు అనుకునే షో ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకోలేదు అనుకోవచ్చు.
కానీ అన్ని ఛానెల్స్ లో అన్ని రియాలిటీ షో లు, కామెడీ షో లు తక్కువ రేటింగ్ తో వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా టీవీ జనాలు చూడట్లేదు అని అర్ధం.
ఇక ఈ ఢమాల్ అంటున్న షో లలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సుమ అడ్డా.చిరంజీవి తో లాంచింగ్ చేసిన ఈ ప్రోగ్రాం దారుణంగా మూగబోయింది.రొటీన్ పంచులు, బోరింగ్ ప్రశ్నలతో బాగా మొనాటని వచ్చేసింది.
ఇకనైనా ఆమె రూటు మార్చుకోకపోతే రిటైర్మెంట్ పక్క.పోయిన వారం వచ్చిన బార్క్ రేటింగ్ చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాయంటే వంద సార్లు వేసిన సినిమాను నూట ఒకటో సారి వేసిన అంత తక్కువ రేటింగ్ రాదు.
కానీ ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ ముందు మిగతా యాంకర్స్ ఎందుకు పనికి రారు అందులో ఎలాంటి డౌట్ లేదు.ఇక ఇదే దోవలో జబర్దస్త్.
ఇప్పటికే చాల రోజులుగా ఈ షో గతి తప్పి ఎదో ఆలా నడుస్తుంది.పేరుకే కామెడి షో కానీ ఫక్తు భూతు షో.అయినా కూడా తన ఫెమ్ కోల్పోయి బార్క్ లిస్ట్ ప్రకారం టాప్ 30 లో స్థానం కూడా సంపాదించుకోలేదు.
శ్రీదేవి డ్రామా కంపెనీ పరిస్థితి కూడా షరా మాములే.3.25 తో జబర్దస్త్ నడుస్తుంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కి 3.46 రేటింగ్ వచ్చింది.ఇలా అన్ని వినోదపు ఛానెల్స్ మట్టిగొట్టుకు పోతున్నాయి.
మా టీవీ సీరియల్స్ తో ఎదో నెట్టుకోస్తుంది.ఇంకో వైపు జెమినీ తనకు ఎవరితో పోటీ లేదన్నట్టు ఛానెల్ ని పట్టించుకోవడమే మానేసింది.
విశేషం ఏమిటి అంటే సన్ మీడియా దేశం లోనే నంబర్ వన్.అదే సంస్థ కు చెందిన జెమినీ మాత్రం తెలుగు లో లాస్ట్ నుంచి ఫస్ట్.ఇంకా కొన్ని రోజులు గడిస్తే దాని గురించి ఎవరికీ గుర్తు కూడా ఉండదు.