సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం అప్పనపేట వద్ద ప్రధాన రహదారిపై గ్రామస్తులు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.కోదాడ టూ మిర్యాలగూడ ప్రధాన రహదారిని నాలుగు లైన్ ల రహదారిగా ఏర్పాటు చేసి,అప్పనపేట వద్ద డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయకుండా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు.
వెంటనే అప్పన్నపేట వద్ద డివైడర్,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.