సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి మనకు అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటూ ఉంటాం.కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం సెలబ్రిటీల ఫోటోలు చూస్తే అస్సలు గుర్తు పట్టలేము.
ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు ఎలా ఉంటారో అందరికీ తెలుసు.కానీ ఇండస్ట్రీలోకి రాకముందు వారి ముఖాలు గుర్తుపట్టలేనంతగా తేడాగా ఉంటాయి అని చెప్పాలి.
ఇక సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.
ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి.
ఈ క్రమంలోనే వార్త చదవక ముందు ఫోటోలో ఉంది ఎవరో చెప్పడం చాలా కష్టం అని చెప్పాలి.ఇప్పుడు ఇలాంటి తరహా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇక్కడ ఫోటోలో నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు.ఒకరు మనందరికీ తెలిసిన గ్రేట్ ప్రొడ్యూసర్ రామానాయుడు మరోవైపు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అతిలోకసుందరి శ్రీదేవి శ్రీదేవి వెనకాల ఆమె చెల్లెలు ఉంది.
కానీ మధ్యలో వైట్ డ్రెస్ వేసుకున్న చిన్నారి పాప ఎవరో మాత్రం ఎవరు గుర్తుపట్టలేక పోతున్నారు.

కానీ చివరికి వార్త చదివిన తర్వాత ఆ చిన్నారి పాప ఎవరో తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.ఇంతకీ ఫోటో లో వైట్ డ్రెస్ లో కనిపిస్తున్న చిన్నారి పాప ఎవరో తెలుసా అక్కినేని హీరో నాగ చైతన్య తల్లి లక్ష్మి.అదేనండి కింగ్ నాగార్జున మొదటి భార్య.
స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు కూతురు.సీనియర్ హీరో వెంకటేష్ తోడబుట్టిన చెల్లి.
ఇక ఇన్ని వరసలు గురించి చెప్పిన తర్వాత ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో క్లారిటీ వచ్చే ఉంటుంది.ఏదేమైనా ఇక ఇప్పుడు లక్ష్మి చిన్ననాటి ఫోటోను చూసి ప్రేక్షకులు అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.