సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన తర్వాత సూర్యాపేట( Suryapeta ) పట్టణం విస్తరిస్తుండటంతో
జిల్లా నలుమూలల నుండి రోజురోజుకీ ట్రాఫిక్ రద్దీ( Traffic ) పెరుగుతున్న మూలంగా ఉన్నతాధికారుల ఆదేశాలననుసరించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు రోడ్డుపై సురక్షిత ప్రయాణం నిమిత్తం కొత్త బస్టాండ్ జంక్షన్ వద్ద గతంలో కొనసాగబడిన ఫ్రీ లెఫ్ట్ విధానమును పటిష్ట పరచటం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) తెలిపారు.
వాహనదారులు మరియు సాధారణ ప్రజానీకం కూడా అవగాహన పెంపొందించుకునే వరకు మీడియా కూడా యొక్క విలువైన తోడ్పాటును అందించాలని కోరారు.