అయోధ్య బాలరాముడిని( Balarama of Ayodhya ) దర్శించుకోవడానికి భక్తులు క్యూ కడుపుతున్నారు.ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అయితే అయోధ్యలోని భక్తులను కొంతమంది వ్యాపారులు దారుణంగా మోసం చేస్తున్నారు.అయోధ్యలో టీ ఖరీదెంతో తెలిసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది.
ఎక్కువ మొత్తం ఖర్చు చేసి టీ కొనుగోలు చేయడం కష్టమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ఒక భక్తుడు అయోధ్యలో ఒక టీ కొనుగోలు చేయడానికి ఏకంగా 55 రూపాయలు ఖర్చు చేశానని అక్కడ టోస్ట్ వైట్ 65 రూపాయలు అని బిల్ ద్వారా తెలిసేలా చేశారు.ఇద్దరు వ్యక్తులు టీ, టోస్ట్ వైట్ కొనుగోలు చేస్తే ఏకంగా 240 రూపాయలు బిల్ అయింది.240 రూపాయల బిల్లులో 12రూపాయలు జీఎస్టీగా ఉంది.అయోధ్యకు వెళ్లాలని భావించే వాళ్లు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

అయోధ్యలో ఒక్క టీ ఖర్చుతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని హోటళ్లలో భోజనం చేయొచ్చని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అయోధ్యలో వ్యాపారాలను నిర్వహించే వాళ్లు భక్తులను దోపిడీ చేయడం కరెక్ట్ కాదని కేంద్రం, యూపీ ప్రభుత్వాలు( Center , UP Govts ) ఈ దోపీడీపై దృష్టి పెట్టాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ధరలు, తగ్గించకపోతే సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల రాక అంతకంతకూ తగ్గే ఛాన్స్ ఉంది.

అయోధ్య రామ మందిరానికి ప్రస్తుతం లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులకు రామ మందిరంలో బాలరాముని దర్శనం కలుగుతోంది.అయోధ్య రామ మందిరంకు సంబంధించిన విషయాలు, విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
చాలామంది సొంత వాహనాల ద్వారా అయోధ్య రాముడిని దర్శించుకుంటూ ఉండటం గమనార్హం.







