వేసవి కాలం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో మండే ఎండలు, వడ గాల్పులు, ఉక్కపోత వంటి కారణాల వల్ల శరీరం సాయంత్రానికి తీవ్రంగా అలసిపోతుంటుంది.
ఈ అలసట మరే పనిపైనా దృష్టి పెట్టనివ్వదు.అలసట వల్ల కొందరు సాయంత్రం వేళ ఫ్యామిలీతో కూడా టైమ్ స్పెండ్ చేయలేకపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే పదార్థాలను నీటిలో కలిపి బాత్ చేస్తే ఎంతటి అలసట అయినా పరార్ అవ్వడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లి పోదాం పదండీ.
సీ సాల్ట్, బేకింగ్ సోడా. ఈ రెండూ అలసటను పోగొట్టి శరీరాన్ని యాక్టివ్‌గా మార్చగలవు.అందుకోసం ఒక బకెట్ గోరు వెచ్చని నీటిని తీసుకుని.అందులో వన్ టేబుల్ స్పూన్ సీ సాల్డ్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి.
ఈ నీటితో స్నానం చేయాలి.ఇలా చేస్తే అలసట నుంచి చక్కటి ఉపశమనాన్ని పొందుతారు.
అలాగే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ పౌడర్ వేసి బాగా మరిగించి డికాక్షన్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ బ్లాక్ టీ డికాక్షన్‌ను బకెట్ గోరు వెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి.ఇలా చేస్తే అలసట, ఒత్తిడి వంటివి దూరమై శరీరం చురుగ్గా మారుతుంది.
ఇక బకెన్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో ఒక కప్పు రోజ్ వాటర్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి.ఆ తర్వాత ఈ వాటర్‌తో స్నానం చేయాలి.
అలసటగా ఉన్నప్పుడు ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.