సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలోని గిరిజనులందరికి గిరిజన బంధు ప్రకటించి ఆర్ధికంగా ఆదుకోవాలని సేవాలాల్ సేన సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడు ధరావత్ కృష్ణ నాయక్ ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.ఆర్ధికంగా వెనుకబడిన ఎస్సిలను ఆదుకుంటున్నట్లుగానే గిరిజనులను కూడా ఆదుకోవాలన్నారు.
గిరిజనులలోనూ ఆర్ధికంగా వెనుకబడిన వారు చాలా మంది ఉన్నారని అన్నారు.ప్రభుత్వం గిరిజన బంధు ప్రకటించి వారిజీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు.గిరిజనులను ఆదుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లని చెప్పుకొచ్చారు.10శాతం రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.రిజర్వేషన్ ను ప్రకటించకపోవడంతో గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.