సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్...!

సూర్యాపేట జిల్లా:నిన్నటి వరకు జిల్లా మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్ధి జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy )కి అత్యంత సన్నితులుగా ఉన్న గులాబీ నేతలు ఒక్కొక్కరు కారు దిగి ఇతర పార్టీలోకి వెళుతున్నారు.ఎన్నికల వేళ సహజంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్,కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం చూస్తున్నాం.

 Big Shock For Brs Party In Suryapet , Guntakandla Jagadish Reddy , Bsp , Rs Pra-TeluguStop.com

కానీ,సూర్యాపేట నియోజకవర్గంలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది.ఇక్కడ మంత్రితో విభేదించి బీఎస్పీ నుండి ఎమ్మేల్యే అభ్యర్ధిగా బరిలో ఉన్న వట్టే జానయ్య యాదవ్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతలపై ష్టి సారించి,ఆ దిశగా సక్సెస్ సాధిస్తున్నట్లుగా మారుతున్న రాజకీయ సమీకరణాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

బీఆర్ఎస్ లో ప్రతీది తెలిసిన వట్టే,ఎక్కడ ఎవరు అసంతృప్తితో ఉన్నారో గుర్తించి వారే టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.అందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులను, జిల్లా స్థాయి నేతలనుబీఎస్పీ( BSP )లో చేర్చుకున్నారు.

ఈ క్రమంలో ఆదివారం గులాబీ పార్టీకి మరో షాక్ ఇచ్చారు.జిల్లా కేంద్రంలో అందరి తలలో నాలుకలా ఉంటూ,పార్టీ పరంగా,వ్యక్తిగతంగా ప్రజా సేవ చేసే ప్రజా నేత,బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గండూరి కృపాకర్( Ganduri Krupakar ), అతని భార్య,సూర్యాపేట 45వ,వార్డు కౌన్సిలర్ గండూరి ప్రవళికను అనూహ్యంగా బీఎస్పీలో చేర్చుకొని తన వ్యూహం ఏమిటో చెప్పకనే చెప్పారు.

గండూరి కృపాకర్ ను హైదరాబాద్ తీసుకెళ్లి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరిపించగా,జిల్లా కేంద్రంలో కౌన్సిలర్ ప్రవళిక తో మరికొంత మంది బీఆర్ఎస్,బీజేపీ,వైఎస్ఆర్ టిపి నేతలను బీఎస్పీలోకి ఆహ్వానించారు.ఇదే బాటలో మరికొందరు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు,నాయకులు బీఎస్పీ గూటికి వచ్చే అవకాశం ఉందని పేటలో టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో సూర్యాపేట నియోజకవర్గంలో బీఎస్పీ వర్సెస్ బీఆర్ఎస్ గా రసవత్తర పోటీ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.ఎన్నికల నాటికి ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్దం కాని పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube