నల్లగొండ జిల్లా:దేవరకొండ పట్టణంలో గత మూడు రోజుల క్రితం జరిగిన హత్య కేసులో నలుగురు నిదితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నట్లు దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.శుక్రవారం దేవరకొండ డీఎస్పీ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
గత మూడు రోజుల క్రితం దేవరకొండ పట్టణంలో యువకుడి హత్య సంచలనం రేకెత్తించింది.కేవలం మూడు రోజుల్లోనే హత్యను చేదించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
పట్టణానికి చెందిన పులిజాల రఘురాములు( Raghuram ) (39) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.దానిని అనుమానస్పద కేసు క్రింద నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు చెప్పారు.
రఘ రాములు భార్య పులీజాల శ్రీలక్ష్మి తన భర్త వేధింపులు భరించ లేక హతమార్చాలని గతంలో నాలుగు సార్లు హంతకులతో కలిసి ప్రయత్నం చేసిందని, నిందితులు చిలకరాజు అరుణ్,ముక్కెర భాను, పెనుగొండ రవితేజ, సుచిత్రతో గతంలో మూడుసార్లు మర్డర్ అటెంప్ట్ చేసి ఫెయిల్ కావడం జరిగిందన్నారు.భర్తను చంపాలని ఉద్దేశ్యంతోనే హత్య చేయించినట్లు కేసు దర్యాప్తులో తేలిందన్నారు.
మూడు రోజుల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో సిఐ పరశురాములు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.







