రాజన్న సిరిసిల్ల జిల్లా : క్లాసులు ఐదు ఓకే టీచర్ బోధనతో ఎల్లారెడ్డిపేట హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పాఠాలు నిర్వహిస్తున్నారు.పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మొత్తం 53 మంది ఉన్నారని పాఠశాల ప్రిన్సిపల్ కరుణ పేర్కొన్నారు.
ఐదు క్లాసులకు గాను 30 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారని అట్టి విద్యార్థిని విద్యార్థులను ఒకే వరండాలో కూర్చుండబెట్టి బోధన చేస్తున్నామని తెలిపారు.తమ పాఠశాలలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు తిరుపతి రేపు జరగబోయే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కు సంబంధించిన మీటింగ్ ఉండడంతో ఎమ్మార్సీకి వెళ్లాడని ప్రధానోపాధ్యాయురాలు కరుణ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడిలో భాగంగా కార్పోరేట్ విద్యావ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా తగ్గుతుంది.మరో ప్రక్క ప్రభుత్వ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల పిల్లలు ప్రైవేటు పాఠశాలలో చేర్పించి, గ్రామస్తుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించిన ప్రజలలో ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించలేకపోయారు.
ఒక్క టీచర్ ఐదు క్లాసులకు విద్యా బోధన ఏ విధంగా చెప్పగలుగుతారని విద్యార్థుల తల్లిదండ్రులు అడుగుతున్నారు.పక్షం రోజుల క్రితం పెద్దబడి ప్రారంభోత్సవం సందర్భంగా సాక్షాత్తు మంత్రి కేటీఆర్ ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
ఉపాధ్యాయుల పిల్లల్ని, ప్రజా ప్రతినిధుల పిల్లల్ని ప్రభుత్వ బడులలో చేర్పించి ప్రజలలో విశ్వాసం కల్పించినప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని పలువురు అంటున్నారు.







