సాధారణంగా భారతదేశంలో( India ) దొరికే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్ ధర సుమారుగా 30 లేదా 40 వేల రూపాయలు వరకు ఉంటుందని అందరికీ తెలిసిందే.స్కాచ్( Scotch ) అనే మాట చాలామంది వినే ఉంటారు.
ఈ స్కాచ్ ధర లక్షల్లో ఉంటుంది.ఎందుకంటే చాలా సంవత్సరాలు పులియా బెట్టడం వల్ల స్కాచ్ విస్కీ తయారవుతుంది కాబట్టి అంత ధర ఉంటుంది.
కానీ కోట్లల్లో ఓ మద్యం బాటిల్ ధర ఉందంటే వినడానికే కాస్త షాకింగ్ గా అనిపిస్తుంది.భూమిపై అత్యంత ఖరీదైన వోడ్కా బాటిల్( vodka ) ధర రూ.30 కోట్లు.ఈ వోడ్కా ప్రత్యేకత ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం.

బిలియనీర్ వోడ్కా, లియోన్ వెర్రెస్ మాస్టర్ పీస్ ( Leon Verres’ masterpiece )అనేవి ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి.వీటి ధర రూ.3.7 మిలియన్ డాలర్లు.మన భారత కరెన్సీలో రూ.30 కోట్లు.ఈ ఒక్క బాటిల్ ధరతో జీవితాంతం బతికేయొచ్చు.
ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ టైం సెటిల్మెంట్ అవ్వడం ఖాయం.ఈ మద్యం బాటిల్ ప్రత్యేకత ఏమిటంటే.? ఈ వోడ్కా బాటిల్ 3000 వజ్రాలతో అలంకరించబడి ఉంటుంది.

ఈ బాటిల్ ఆకర్షణీయకంగా కనిపించేందుకు వైలెట్- హ్యూడ్ హెవీ గ్లాస్ తో ప్రత్యేకమైన పూత పూసి ఉంటుంది.బాటిల్ లోపల ఉండే మద్యం కంటే బాటిల్ ధర ఎక్కువగా ఉంటుంది.ఈ ఖరీదైన బాటిల్ ను ప్లాటినం, రోడియం వంటి విలువైన లోహాల కలయికతో ఎంతో అందంగా తయారు చేశారు.ఈ బాటిల్ పై ఉండే లేబుల్ గోల్డ్ లేబుల్.
ఈ బాటిల్ ఉపరితలం అంతా వజ్రాలతో అలంకరించబడి ఉంటుంది.ఇన్ని రకాల ప్రత్యేకతలతో తయారు చేయబడింది కాబట్టే.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం గా ఉంది.







