ఒకపూట నాటు కూలీగా మారిన తహశీల్దార్

సూర్యాపేట జిల్లా:సాధారణంగా ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు రకరకాల పనులు చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులివ్వడం అందరికీ తెలిసిందే.కానీ,అధికారులు అలాంటి వాటికి దూరంగానే ఉంటారు.

 A Tahsildar Who Became A Farm Laborer-TeluguStop.com

సోమవారం ఓ మహిళా తహసీల్దార్ మాత్రం తమ విధులు నిర్వహిస్తూనే ఒకపూట మహిళలతో కలిసి వ్యవసాయ పొలంలో నాటేయడం మహిళా కూలీలను,స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకవీడు తాహసిల్దార్ గా పనిచేస్తున్న వల్లే శ్రీదేవి తమ విధులు నిర్వహిస్తూనే మహిళలతో కలిసి ఒకపూట వరినాట్లు వేసి,వారి బాధలు తెలుసుకొన్నారు.

నాటేయడం అంటే సాదాసీదా విషయం కాదని,అది చాలా కష్టమైన ప్రక్రియ అని,అది కేవలం మహిళలకే సాధ్యమని తహసీల్దార్ శ్రీదేవి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube