టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు.
మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బర్త్ డే సందర్భంగా విషెష్ చెబుతూ సందడి చేస్తున్నారు.వీరితో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో ఈయనకు విషెష్ చెబుతున్నారు.
ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే వరుసగా పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ లు ఇస్తూ మెగా ఫ్యాన్స్ కు మెగా ట్రీట్ ఇస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.
ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.ఇక ఈయన పుట్టిన రోజు సందర్భంగా నిన్ననే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తుంది.

మెగా ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా టీజర్ ను కట్ చేసారు.ఈ టీజర్ లో చిరుతో పాటు నాయన తార, సల్మాన్ ఖాన్ ను కూడా చూపించి మరింత ఆసక్తి కలిగేలా చేసారు.అలాగే మెగాస్టార్ గెటప్ కూడా ఆకట్టుకుంది.మెగాస్టార్, సల్మాన్ ఖాన్ ఒకే షాట్ లో కనిపించి కేక పెట్టించారు.దీంతో ఈ టీజర్ రిలీజ్ అయినా 12 గంటల్లోనే 6 మిలియన్స్ ను క్రాస్ చేసింది.







