సూర్యాపేట జిల్లా:కాంగ్రేస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ద్విగ్విజయంగా కొనసాగాలని ఆంజనేయస్వామిని కోరుకున్నానని ఐఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి,దక్షిణ మధ్య రైల్వే జోనల్ మెంబర్ యరగాని నాగన్న గౌడ్ తెలిపారు.రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు చేపట్టిన”భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా హుజూర్ నగర్ పట్టణంలో ఐఎన్టీయుసి ఆధ్వర్యంలో గోపాలపురం ఆంజనేయస్వామి టెంపుల్ లో 150 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి, టెంపుల్ వద్ద నుండి సుమారు ఐదు కిలోమీటర్లు సంఘీభావ పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ సుధీర్ఘ పాదయాత్రకు సన్నద్ధమయ్యారని అన్నారు.కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి బుధవారం సాయంత్రం ప్రారంభమైందని సుమారు 3,570 కి.మీ మేర భారత్ జోడో యాత్ర కోనసాగనుందని,12 రాష్ట్రాల్లో దాదాపు 148 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందన్నారు.ఈ యాత్రలో అగ్రనేతలతో సహా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని పిలువునిచ్చారు.
మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర సాగుతుందని,రాహుల్ గాంధీకి ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలన్నారు.భారతదేశ చరిత్రలో రాహుల్ పాదయాత్ర మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.
దేశంలో విభజన వాద రాజకీయాలు, మతోన్మాదంతో పాటు పెరిగిపోతోన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం,అసమానతలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించి దేశ ప్రజలను ఏకం చేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామల శివారెడ్డి,గోపాలపురం సర్పంచ్ నాగసైదయ్య,హుజూర్ నగర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,హుజూర్ నగర్ నియోజకవర్గ మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సైదా,మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ ఉర్దండు,ఐఎన్టియుసి నాయకులు బెల్లంకొండ గురవయ్య గౌడ్,ముక్కంటి, యూత్ కాంగ్రెస్ నాయకులు కుక్కడపు మహేష్, రాము,కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లన్న,సావిత్రి, అచ్చమ్మ,వీరయ్య,మున్సిపల్ కౌన్సిలర్లు,మరియు గోపాలపురం గ్రామ వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.