తెలుగు ప్రేక్షకులకు చందమామ సినిమా తో చేరువ అయిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ దాదాపు దశాబ్ద కాలం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన విషయం తెలిసిందే.ఆమె దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది.
కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ్ సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది.హిందీ సినిమా ల్లో కూడా కొన్ని నటించిన సౌత్ లో ఆమెకు ఎక్కువ గా పాపులారిటీ దక్కింది.
సుదీర్ఘ కాలం సినీ ప్రస్థానం కలిగిన ఈ అమ్మడు కరోనా సమయం లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.పెళ్లి అయిన కొన్ని నాళ్ళకే బాబుకి కూడా జన్మనిచ్చింది.
బాబు కు జన్మనిచ్చిన సమయం లో ఈమె కు వచ్చిన ఒకటి రెండు సినిమా ఆఫర్లను వదిలేసింది.
పెళ్లి కాక ముందు కమిట్ అయినా ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఇప్పుడు బాబు తో కలిసి కాజల్ అగర్వాల్ పాల్గొంటుంది.
తమిళనాడు చెన్నై లో జరుగుతున్న షూటింగ్ లో భాగం గా కొడుకు తో కలిసి కాజల్ అగర్వాల్ రావడం అక్కడి వారిని ఆకర్షించింది.తనయుడి ని వెంట బెట్టుకుని వచ్చిన కాజల్ అగర్వాల్ షూటింగ్ స్పాట్ లోకి అతడిని తీసుకు రాకుండా హోటల్ రూమ్ లో ఉంచినట్లుగా తమిళ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
కాజల్ అగర్వాల్ ముందు ముందు వరుసగా మళ్లీ సినిమాలను కమిట్ అయి గతం లో మాదిరిగా స్పీడ్ గా సినిమా లు చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన కొత్త ఒప్పందాలు ఏమి జరగలేదని.
కానీ భవిష్యత్తు లో ఈ అమ్మడు ఓకే చెప్తే వరుస గా ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికి కొత్త సినిమా లకు సైన్ చేయని ఈమె గతం లో ఓకే చెప్పిన సినిమా కనుక ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతుంది.







