వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గును కేవలం 2 రోజుల్లో తరిమికొట్టే పవర్ ఫుల్ డ్రింక్ మీ కోసం!

వర్షాకాలం( rainy season ) రానే వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మెల్లమెల్లగా ఊపందుకుంటున్నాయి.

 This Powerful Drink Helps To Get Rid Of Cold And Cough In Monsoon! Monsoon, Powe-TeluguStop.com

వర్షాకాలం మనసుకు ఎంతో ఆహ్లాదకరాన్ని అందించిన.ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి.

ఎందుకంటే వర్షాకాలం వస్తూ వస్తూనే ఎన్నో జ‌బ్బులను కూడా మోసుకొస్తుంది.ప్రధానంగా ఈ సీజన్ లో జలుబు, దగ్గు వంటి సమస్యలతో పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ సతమతం అవుతుంటారు.

పైగా ఇవి ఇంట్లో ఒక్కరికి వచ్చాయంటే మిగిలిన వారికి కూడా సులభంగా వ్యాప్తి చెందుతాయి.

ఇక వాటిని తగ్గించుకునేందుకు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కాదు.

అయితే వర్షాకాలంలో వేధించే సాధారణ జలుబు, దగ్గును( Cold , cough ) కేవలం రెండు రోజుల్లో తరిమికొట్టే పవర్ ఫుల్ డ్రింక్ ఒకటి ఉంది.ఆ డ్రింక్ ఏంటి.

దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలను( Garlic cloves ) తీసుకుని పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Telugu Cough, Garlic, Tips, Honey, Latest, Lemon, Powerful, Powerfulhelps-Telugu

వాటర్ హీట్ అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అందులో వేసుకోవాలి.అలాగే రెండు లెమన్ స్లైసెస్ ( Lemon slices ) వేసుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనెను కలిపితే మన డ్రింక్ అనేది సిద్ధమవుతుంది.

గోరువెచ్చగా అయిన తర్వాత ఈ డ్రింక్ ను తీసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే ఎలాంటి జలుబు, దగ్గు అయినా పరార్ అవుతాయి.

Telugu Cough, Garlic, Tips, Honey, Latest, Lemon, Powerful, Powerfulhelps-Telugu

వెల్లుల్లి జలుబు మరియు ఫ్లూ తో పోరాడటానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.అలాగే నిమ్మకాయలో విటమిన్ సి( Vitamin C ) మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచడానికి.ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది.జలుబు ద‌గ్గు వంటి సమస్యలను వేగంగా తరిమి కొడుతుంది.ఇక తేనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

తేనెలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ మరియు ఇతర పోషకాలు సీజనల్ వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవడానికి తోడ్పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube