సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో అదనపు పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన స్థలాన్ని గ్రామానికి చెందిన మర్రి వీరబాబు ఆక్రమించి అదనపు పల్లె ప్రకృతి వనం పనులు చేయకుండా అడ్డు తగులుతూ గ్రామ పంచాయతీ పాలక వర్గంతో నిత్యం గొడవకు దిగుతున్న వైనంపై గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు( Jonnalagadda Srinivasa Rao ) రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గ్రామ సర్పంచ్ చెబుతున్న వివరాల ప్రకారం.
ఖానాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 778లో స్థలాన్ని అదనపు పల్లె ప్రకృతి వనానికి కేటాయించగా,ఈ స్థలం తనదని గ్రామానికి చెందిన మర్రి వీరబాబు చెబుతూ ప్రభుత్వ పనులకు నిత్యం అడ్డుకుంటూ వాగ్వాదానికి దిగుతున్నాడు.దీనితో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ఆటంకం కలుగుతుంది.
అసలు ఈ భూమి గ్రామ కంఠానికి చెందినదా లేదా మర్రి వీరబాబుకు చెందినదా తెలియాలంటే రెవిన్యూ అధికారులు ఈ భూమిని సర్వే చేయించి, హద్దులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.అందుకే వీలైనంత త్వరగా రెవిన్యూ అధికారులు స్పందించి ఈ భూమి యొక్క వివాదానికి తెరేపడెలా చూడాలని సర్పంచ్ మంగళవారం అనంతగిరి తహశీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
సర్పంచ్ వినతిపై రెవిన్యూ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి…!!
.