సూర్యాపేట జిల్లా:ప్రజావాణిలో అర్జీదారుల నుండి స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు సూచించారు.
సోమవారం ప్రజావాణిలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసమస్యలకు సంబంధించి మీ సేవా ద్వారా సంబంధిత వివరాలను సరిగా చేసుకోవాలని అలాగే వచ్చిన ప్రతి అర్జీదారులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
అలాగే మండలాల్లో ఉన్న భూసమస్యల దరఖాస్తులను తెప్పించి క్షున్నంగా పరిశీలించి అర్జీదారులు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.ప్రజావాణిలో ఎక్కువగా భూ సమస్యలకు సంభందించిన దరఖాస్తులు అందాయని ఈ రోజు ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 29, ఇతర శాఖలకు సంబంధించి 17 దరఖాస్తులు మొత్తం 46 అందాయని అట్టి దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు పులి సైదులు,సుదర్శన్ రెడ్డి, అధికారులు,అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.