రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రావడంతో ప్రాంతీయ, జాతీయ పార్టీల్లో కదలికలు మొదలయ్యాయి.ఎవరి వ్యూహ రచనలో వారు నిమగ్నమై ఉన్నారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నేతలు భేటీ అవుతూ చర్చలు మొదలుపెట్టారు.అయితే బీజేపీ మాత్రం ప్లాన్ తో పావలు కదుపుతోంది.
ప్రత్యర్థులు ఎంత వ్యతిరేకించినా చేసేది ఏమి లేకపోయినప్పటికీ బీజేపీ మాత్రం ఏకగ్రీవం కోసం పట్టుపడుతోంది.అయితే దీని వెనక బీజేపీ పెద్ద ప్లానే ఉంది.
బీజేపీపై ప్రతిపక్షాల వ్యతిరేకత, ప్రాంతీయ పార్టీల తీరు ఎలా ఉందో తెలుసుకోవడానికే ఇలా వ్యూహ రచన చేస్తోందనే వాదన వినిపిస్తోంది.అందుకే బీజేపీ ఏకగ్రీవానికి పట్టుపడుతోందిని అంటున్నారు.
అయితే బీజేపీ ఇప్పటికే ఓ దళిత మహిళను కానీ ఓ మైనార్టీ మహిళను కానీ పోటీలోకి దించేందుకు ప్లాన్ రచించిందని చర్చ నడుస్తోంది.ఇదంతా కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే పొలిటికల్ ప్లాన్ నడుస్తోందని సమాచారం.
అలాగే బీజేపీ తమ లిస్ట్ లో పలు రాష్ట్రాల గవర్నర్లు, ఉపరాష్ట్రపతి, మాజీ గవర్నర్ ను ప్రతిపాదిస్తూ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.అయితే ఎన్టీఏకి వ్యతిరేకంగా యూపీఏ కూటమి కూడా పట్టు సాధించేందుకు ప్లాన్ వేస్తోంది.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వ్యూహాలు రచిస్తోంది.అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకి గెలిచేది బీజేపీ పంథమే అని అందరికీ తెలిసిందే.
అయితే బీజేపీ మాత్రం ఈ ఎన్నిక ద్వారా ఎంత వ్యతిరేకత ఉందనేది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందనే వాదన వినిపిస్తోంది.ఈ ఎన్నికతో మిత్రులు ఎవరూ.శత్రువలు ఎవరూ అని తేల్చేపనిలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఎన్సీపీ నేత శరద్ పవార్ తో ఆప్ నేత సంజయ్ సింగ్ తాజాగా ముంబైలో భేటీ అయ్యారు.
ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికపై చర్చించినట్లు సమాచారం.అయితే ఈ భేటీ తర్వాత ఆప్ తన నిర్ణయం ఏంటన్నది.
పవార్ తో భేటీ ఎందుకు అయినట్లు అనేది చర్చ జరుగుతోంది.ఇక ఎన్డీఏ మాత్రం అన్ని పార్టీలను కలుపుకొని పోయే నేపథ్యంలో ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతోంది.