విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

సూర్యాపేట జిల్లా:విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయని,రేపటితరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని తెలిపారు.

 Students Should Excel In Sports Along With Studies-TeluguStop.com

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని,క్రీడాకారులకు, కళాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.గురుకుల పాఠశాలలో ప్రతి విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కబడ్డీ ఆడారు.క్రీడలు ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.గురుకుల పాఠశాల రీజినల్ కో ఆర్డినేటర్ అరుణ కుమారి ఎమ్మెల్యేని మెమోంటోలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్ కుమార్,డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి,ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు,జెడ్పిటిసి కవిత నాగరాజు,సర్పంచి గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్,కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,పిఈటిలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube