నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK‘.ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో నందమూరి బాలకృష్ణ షో ఒకటి.
ఆహా ఓటిటి లో స్టార్ట్ అయినా ఈ షో అందరి అంచనాలను మించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.బాలకృష్ణ అంటే ఉండే అభిప్రాయం ఈ షో వల్ల చాలా వరకు మారిపోయిందని చెప్పాలి.
సినీ సెలెబ్రిటీలు అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది.ఇక ఇప్పుడు సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా అని ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.అయితే అతి త్వరలోనే ఈ సీజన్ 2 స్టార్ట్ కాబోతుంది.
ఈ క్రమంలోనే ఆహా వారు ఈ షో మీద ఇంట్రెస్ట్ పెంచేందుకు ప్రొమోషన్స్ స్టార్ట్ చేశారు.ఈ మేరకు అన్ స్టాపబుల్ సీజన్ 2 యొక్క యాంతమ్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అఫిషియల్ గా ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.
మరి సీజన్ 2 కూడా అదే రేంజ్ లో అలరిస్తుందో లేదో చూడాలి.
ప్రెసెంట్ బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.అఖండ భారీ విజయం తర్వాత క్రాక్ డైరెక్టర్ తో సినిమా స్టార్ట్ చేసి వేగంగా పూర్తి చేస్తున్నాడు.ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.107 సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.