కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం బృందావనపురం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశానుసారం మంగాలు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గుండు నాగేశ్వరరావు మరియు మండల నాయకులు దొంతగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెడుతూ తెలుగుదేశం పరిపాలన హయాంలో చేసిన అభివృద్ధి పాంప్లెంట్ ఇస్తూ సభ్యత్వాన్ని నమోదు చేశారు.
అనంతరం కోదాడ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ ఓరుగంటి ప్రభాకర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణలో జరుగు అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చిలుకూరు వైస్ ఎంపీపీ జనపనేని కృష్ణారావు,వి ఎల్.ఎన్.గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షులు పుట్ట ఆంజనేయులు,ప్రధాన కార్యదర్శి కాసాని వీరబాబు,శ్రీనివాస్ గౌడ్, ఉపేందర్ గౌడ్,మామిడి ఎల్లమ్మ,కాసాని వీరమ్మ, మామిడి మంగమ్మ, మండల నాగమణి తదితరులు పాల్గొన్నారు.