మొటిమలు కేవలం ముఖంపైనే రావు కదా.కొందరిపై విపరీతంగా శరీరమంతా దాడిచేస్తాయి పాపం.
అందులోనూ ఛాతి భాగంపై మొటిమలతో బాధపడేవారు ఎక్కువ.ఆయిల్ గ్లాన్డ్స్ ఛాతి దగ్గర ఎక్కువగా ఉండటం వలన ఆ ప్రదేశంలో మొటిమల బెడద ఎక్కువగానే ఉంటుంది.
తినే తిండి వలన కావచ్చు, హార్మోనల్ ఇమ్బ్యాలేన్స్ వలన కావచ్చు, కాస్మెటిక్స్ అతిగా వాడటం వలన కావచ్చు, ఛాతిపై మొటిమలు పెద్దగా ఏర్పడి బాగా నొప్పిని కలిగిస్తాయి.వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో దొరికే వనరులతోనే చికిత్స మొదలుపెట్టవచ్చు.
* టూత్ పేస్ట్ లో యాంటి బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి.కాబట్టి మొటిమలపై టూత్ పేస్ట్ రాసి మంచి ఫలితాలు చూడవచ్చు.
* బేకింగ్ సోడా లో ఎక్ఫోలియేటింగ్ ఏజెంట్స్ ఉంటాయి.టీస్పూను బేకింగ్ సోడాను నీటిలో వేసి ఛాతిపై రాయడం వలన మొటిమల బెడద తప్పుతుంది.
* పసుపు యాంటి ఇంఫ్లెమేంటరి, యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుందని కొత్తగా చెప్పేదేముంది.రోజ్ వాటర్, పసుపు మిశ్రమాన్ని ఛాతిపై రాయండి.మొటిమల ఇబ్బంది ఎంతవరకు తగ్గుతుందో చూడండి.
* కలబందలో anthraquinones మరియు flanonoids ఉండటం వలన ఇది మొటిమలపై గట్టి ప్రభావం చూపుతుంది.
మొటిమలు ఉన్న ప్రదేశాల్లో కలబంద రాసి, ఓ అరగంట అలానే ఉంచి కడిగేసుకుంటే మంచిది.