ఉదయాన్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నోసార్లు టీ( Tea ) తాగే వారు చాలామంది ఉన్నారు.అలాంటి వారికి టీ అంటే ఒక అలవాటు లాగా అయిపోయి ఉంటుంది.
వారు ఉదయాన్నే లేచి టీ షాప్ ఎక్కడ కనిపించినా కూడా అక్కడికి వెళ్లి తాగేస్తుంటారు.ఇక ఇంట్లో కూడా ఒకసారి చేసిన టీ నీ మళ్ళీ మళ్ళీ మరిగించి తాగేస్తుంటారు.
అయితే ఇలాంటి వారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు( Health problems ) వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవాలి.
ఉదయాన్నే ఒక ఐదారు కప్పుల టీ ను రెడీ చేస్తారు.అదే టీ నీ మళ్లీ మళ్లీ మరగపెట్టి తాగుతారు.

హోటల్స్ లో కూడా ఇలాగే జరుగుతుంది.ఇలా పదేపదే వేడి చేసిన టీ ని తాగడం వలన అసలు మంచిది కాదు.రుచి, వాసన కోల్పోతుంది.అంతేకాకుండా టీ లో ఉండే పోషకాలు, ఖనిజాలు కూడా తగ్గిపోతాయి.ముఖ్యంగా నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు ఉంచిన టీ నీ మళ్లీ వేడి చేసి తాగడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.ఎందుకంటే దానిలో బ్యాక్టీరియా ( Bacteria )పెరిగిపోయి, ఫంగస్ వృద్ధి చెందుతుంది.
ఇలా మళ్లీ మళ్లీ రెడీ చేయడం వలన బ్యాక్టీరియా ఎక్కువ శాతం విడుదలై రుచి లేని గుణాన్ని ఇస్తుంది.దీంతో అతిసారం, తిమ్మిర్లు( Cramps ), కడుపుబ్బరం,( stomach upset ) వికారం లాంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.

అందుకే వీటిని తేలికగా తీసుకోకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.లేదా ఒకేసారి ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఇక టీ ని తయారు చేసేటప్పుడు కేవలం 15 నిమిషాల వరకు మాత్రమే వేడి చేసుకోవాలి.ఆ సమయం వరకు బ్యాక్టీరియా అభివృద్ధి చెందకపోవచ్చు.ఇక నాలుగు గంటలకు నుంచి ఎక్కువ సేపు ఉంచిన టీ నీ మళ్లీ తాగితే ఇది చాలా హానికరం.అవసరమైనంత టీ ని మాత్రమే సిద్ధం చేసుకోవాలి.
టైం కలిసి వస్తుందని ఒకేసారి పెట్టుకుంటే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టే.