సూర్యాపేట జిల్లా: జిల్లాలోని అనంతగిరి మండలంలో దొంగల ముఠా హల్ చల్ చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే…మండల పరిధిలోని వాయిలసింగారం గ్రామంలో డిసెంబర్ 30వ తారీకు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా గాంధీ విగ్రహాం, బాబు జగ్జీవన్ రావు విగ్రహం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేశారు.
అదేవిధంగా గ్రామపంచాయతీ దగ్గర గల కూరగాయల మార్కెట్ నందు 20 వేల రూపాయల కూరగాయలను చోరీ చేశారు.
ఈ ఘటనపై ఎంపీపీ,గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విగ్రహాలు ధ్వంసం చేసిన వారు ఎవరైనా సరే వారికి శిక్షపడేలా చూడలని, గ్రామం నుండి పెద్ద మనుషులు వారి తరఫున ఉండకుండా పోలీసులు స్వచ్ఛందంగా వారి విధులు నిర్వహించి నిందితులను పట్టుకోనీ వారికి శిక్ష పడేలా చేయాలని అన్నారు.అనంతరం పోలీసులు వచ్చి విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా ధ్రువీకరించిన తరువాత విగ్రహాలను ధ్వంసం చేసిన వారు ఎవరైనా సరే వారిని ఖచ్చితంగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు.