విశాఖలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది.
ఉపాధి నిమిత్తం ఒడిశా నుంచి వచ్చిన బాలికపై మానవ మృగాలు దాడికి పాల్పడ్డారు.17 ఏళ్ల అమ్మాయిని ప్రేమ పేరుతో వంచించిన యువకుడు లాడ్జ్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.తరువాత తన స్నేహితుడిని కూడా హోటల్ కు పిలిపించి అత్యాచారం చేయించాడు.ప్రియుడు నమ్మించి మోసం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక బలవన్మరణం చేసుకునేందుకు ఆర్కే బీచ్ కు చేరుకుంది.
బాధిత బాలిక అక్కడ రోదిస్తుండగా పర్యాటకుల ఫొటోలు తీసే ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.రెండు రోజుల పాటు గదిలోనే బంధించి బాలికపై ఫొటోగ్రాఫర్ తో పాటు మరో ఏడుగురు ఘాతుకానికి పాల్పడ్డారు.
లాడ్జి నుంచి తప్పించుకుని బాధిత బాలిక స్వగ్రామానికి చేరుకుంది.మరోవైపు డిసెంబర్ 18వ తేదీన బాలిక కనిపించడంలేదని విశాఖలో పనిచేసిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 22న ఆమెను గుర్తించి విశాఖకు తీసుకువచ్చారు.ఆ సమయంలో బాధిత బాలిక అసలు జరిగిన విషయాన్ని బయటపెట్టడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.