ఈ వేసవిలో కూల్ డ్రింక్స్, గోలి సోడా లాంటి పానీయాలు కాకుండా కొత్తగా ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను ట్రై చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు.అయితే నిమ్మరసం, చెరుకు రసం, పళ్ళ రసాలు కూడా సాధారణమైనవే.
అయితే తేనెలో దాల్చిన చెక్క కలుపుకొని తాగితే బాడీని రిఫ్రెష్ చేయడం మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగదిలో ఉండే ఈ దాల్చిన చెక్క అందరికీ అందుబాటులో ఉంటుంది.
దీని కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.దాల్చిన చెక్క( Cinnamon )తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువును తగ్గించడానికి దీనికంటే మంచి డ్రింక్ లేదని చెప్పవచ్చు అయితే గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె, దాల్చిన చెక్క వేసుకొని ఈ ప్రతిరోజు ఉదయాన్నే తాగితే త్వరగా బరువు తగ్గడమే కాకుండా పొట్ట చుట్టూ కొవ్వు మాయమవుతుంది.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ( Bad cholesterol )స్థాయిని తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.అలాగే గుండెను ఆరోగ్యవంతంగా కూడా ఈ డ్రింక్ ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు.అలాగే శరీరంలో మంట వేడిని కూడా ఈ దాల్చిన చెక్క, తేనె పానీయం తగ్గిస్తుందని ఆయుర్వేదంతో పాటు ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు.
ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.తేనే దాల్చిన చెక్క, నీళ్లు తాగినా, లేక ఆ మిశ్రమాన్ని అలాగే చర్మంపై రాసుకున్నా కూడా చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది.

మొటిమలు, చర్మం పగలడం లాంటి సమస్యలను కూడా వెంటనే తగ్గిస్తుంది.కడుపులో అల్సర్లు రాకుండా కూడా చేస్తుంది.అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ఇక అసిడిటీ లాంటి ఇతర కడుపు జీర్ణ సమస్యలు( Digestive problems ) ఏవి ఉన్నా కూడా ఈ పానీయాన్ని తాగడంతో ఉపశమనం లభిస్తుంది.
ప్రతిరోజు ఒక కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్క వేసుకుని తాగి ఆ ఫలితాన్ని తెలుసుకోవచ్చు.ఇది ఒకేసారి గుండె, చర్మం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అలాగే దాల్చిన చెక్క, తేనె పానీయంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.