సాధారణంగా కొందరికి బాడీ మొత్తం వైట్ గా ఉన్నా సరే ముఖం మాత్రం కాస్త రంగు తక్కువగా ఉంటుంది.ఎండల ప్రభావం, మృత కణాలు పేరుకుపోవడం, రసాయనాలు అధికంగా ఉండే మేకప్ ఉత్పత్తులను వినియోగించడం తదితర కారణాల వల్ల చర్మం రంగు తగ్గుతుంది.
దాంతో చాలా మంది ముఖాన్ని వైట్ గా మార్చుకునేందుకు మార్కెట్లో లభ్యం అయ్యే ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్( Skin whitening creams ) ను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ తో మాత్రం రెండు వారాల్లో ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( rice ) వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత అరకప్పు వాటర్ పోయాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), చిటికెడు కుంకుమ పువ్వు, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్( Glycerin ), రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని ఐదు నిమిషాల పాటు స్పూన్ సహాయంతో ఆగకుండా బాగా మిక్స్ చేయాలి.తద్వారా ఒక స్మూత్ క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని నిద్రించాలి.ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను రెగ్యులర్ గా కనుక వాడితే చర్మం క్రమంగా తెల్లబడుతుంది.స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేయడానికి ఈ క్రీమ్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
పైగా ఈ క్రీమ్ ను వాడటం వల్ల చర్మం స్మూత్ గా షైనీ గా మారుతుంది.ఏమైనా మచ్చలు ఉంటే క్రమంగా మాయం అవుతాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మరియు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.
చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.