సూర్యాపేట జిల్లా:గత రెండు నెలలుగా ఎస్ఆర్ఎస్ పి 69,70,71 డిబిఎం కాలువలకు నీరు విడుదల అవుతున్నప్పటికీ నూతనకల్ మండలానికి వచ్చే 70 డిబిఎం కాలువ ద్వారా కింది ప్రాంతానికి నీళ్లు రాక పోవడం శోచనీయమని యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పసుల అశోక్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం మండల పరిధిలోని గ్రామాల మధ్య 70 డీబీఎం కాలువలో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ఇక్కడి రైతులపై చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే రైతులు వేసిన ఆరుతడి పంటలు సైతం ఎండిపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు స్పందించి క్రింది ప్రాంతానికి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లేనట్లయితే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతులు మద్దిరాల శంకర్,బోయిని యాదగిరి,అనంతుల కృష్ణయ్య,ఆవుల సుధాకర్, ఇరుగు వెంకన్న,సూరారపు మహేష్,అవిలమల్లు, నూకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.