సూర్యాపేట జిల్లా:జిల్లాలో కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవినీతి రాజ్యమేలుతోందని,మంత్రి జగదీష్ రెడ్డి బినామీలు ధనార్జనే ధ్యేయంగా ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నేత సంకినేని వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 38 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉంటే కేవలం 7 ఏజెన్సీలకు మాత్రమే టెండర్లు లేకుండా ఉద్యోగాల నియామక ప్రక్రియ ఎలా కేటాయిస్తున్నారని నిలదీశారు.
జీఎస్ (గుంతకండ్ల సావిత్రమ్మ ట్రస్ట్) సెక్యూరిటీ సర్వీసెస్ 2019-20 సంవత్సరంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీగా రిజిస్ట్రేషన్ జరిగిందని,ఈ ఏజెన్సీ ఓనర్ మధుసూదన్ రెడ్డి మంత్రి మేనమామ అని,ఈ ఏజెన్సీకి మెడికల్ కాలేజీలో టెండర్ లేకుండా 71 పోస్టులు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ జీఎస్ సంస్థ పోస్టులను అర్హులైన నిరుద్యోగులకు ఇవ్వకుండా,టిఆర్ఎస్ నాయకుల ద్వారా ఒక్కో పోస్ట్ 2 నుంచి 3 లక్షలకు అమ్ముకున్నారని తెలిపారు.
లీనా మ్యాన్ పవర్ ఏజెన్సీ 2020-21 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ జరిగిందని,ఈ ఏజెన్సీ కి ఓనరైన మామిడి కిరణ్ ఇమాంపేట ఎంపీటీసీగా ఉన్నారని,ఈ ఏజెన్సీకి ఒకే సంవత్సరంలో ఆరు శాఖలలో టెండర్లు లేకుండా 130 ఉద్యోగాలను కేటాయించడం జరిగిందన్నారు.ఏ ప్రాతిపదికన ఈ ఏజెన్సీకి ఉద్యోగాలు కేటాయించారో జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గుంతకండ్ల సావిత్రమ్మ ట్రస్ట్ పేరుమీద నిర్వహించిన జాతీయ కబడ్డీ పోటీల్లో స్టేజీ కూలి 250 మంది గాయపడినందుకా? టెండర్లు లేకుండా జిఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ కు మెడికల్ కళాశాలలో 70 ఉద్యోగాలు కేటాయించినందుకా అని ప్రశ్నించారు.మంత్రి అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తూనే,అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుమీద నిరుద్యోగులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
మంత్రిపై ప్రజావ్యతిరేకత ఉందని ముందే గ్రహించి షాదీ ముబారక్,కళ్యాణ లక్ష్మి,సీఎం రిలీఫ్ ఫండ్ తో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి.
అబిద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర,కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల వెంకట్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్, అయితగాని జానయ్య,జిల్లా కార్యదర్శి సంధ్యల సైదులు,సీనియర్ నాయకులు చల్లమల్ల నరసింహ, కొండేటి ఏడుకొండలు,దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వల్దాసు ఉపేందర్,మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మీర్ అక్బర్,జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ సైదా హుస్సేన్,ఆకారపు పరిపూర్ణ చారి,యువమోర్చా పట్టణ అధ్యక్షులు దోసకాయల ఫణి నాయుడు,పట్టణ నాయకులు ఆరూరి శివ,జల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.