వందేమాతరం శ్రీనివాస్.తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగీత దర్శకుడు.ఒకప్పుడు వందేమాతరం పాటలు జనాన్ని ఓ ఊపు ఊపాయి.3 సార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.3 సార్లు బెస్ట్ సింగర్‌గా నంది అవార్డులు అందుకున్న వ్యక్తి.తన పాటలతో ఒకప్పుడు యువతీ యువకులను విప్లవం వైపు అడుగులు వేయించిన పాటకారుడు.
ప్రస్తుత తరానికి ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు.కానీ దశాబ్దం కిందట ఆయనో పాటల సునామీగా గుర్తింపు పొందాడు.
స్వరాజ్యం సినిమాలో కాలేజీ కుర్రవాడా అనే పాట..నేటి భారతం చిత్రంలో అత్తా పోదాము రావే సర్కారు దవాఖానకి అనే సాంగ్.వందేమాతరం సినిమాలో వందేమాతర గీతం వరస మారుతున్నది.
ఇదా ప్రపంచం చిత్రంలో బండెల్లిపోతోందే సెల్లెలా.రేపటి పౌరులు మూవీలో అయ్యా నే సదివి బాగుపడతా.
ప్రజాస్వామ్యం చిత్రంలో లబోదిబో లబ్‌ోనకర.ఒసేయ్ రాములమ్మ సినిమాలో రాములమ్మో ఓ రాములమ్మా.
ఒరేయ్ రిక్షా సినిమాలో మల్లెతీగకు పందిరివోలె.చీమల దండు సినిమాలో ఎర్రజెండెర్రజెండర్రజెండన్నీయలో అనే పాటలతో వందేమాతరం శ్రీనివాస్ అప్పట్లో సంచలనం సృష్టించాడు.
వందేమాతరం పాటలు వింటూ జనాలు థియేటర్లలో ఉద్వేగంతో ఊగిపోయేవారు.ఆ పాటలు విని విప్లవ దారి పట్టిన యువకులు ఎంతో మంది ఉన్నారని చెప్పక తప్పదు.
1975 నవంబర్‌లో ఖమ్మంలో ప్రజానాట్యమండలి శిక్షణా శిబిరం జరిగింది.దాదాపు 200 మంది కళాకారులు పాటలు నేర్చుకోవడానికి అక్కడికి వచ్చారు.ఖమ్మం సమీపంలోని రామకృష్ణాపురంలో పుట్టి పెరిగిన శ్రీనివాస్.అక్కడికి వచ్చాడు.ముందుగా ఆ చిన్నోడిని చూసి నిర్వాహకలు లైట్ తీసుకున్నారు.కానీ మూడు రోజులు అక్కడే ఉన్నాడు.
మూడో రోజు అతడికి అవకాశం వచ్చింది.ఎవరైనా పాడేవాళ్లు ఉంటే పాడొచ్చని నిర్వాహకులు చెప్పడంతో వెంటనే వెళ్లి మైక్ అందుకున్నాగు శ్రీనివాస్.
తెలుగువీర లేవరా అనే పాటను హై పిచ్‌లో తను పాడుతుంటే అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు.అక్కడే దిగ్గజన నటులు నాగభూషణం, జమున, అల్లు రామలింగయ్య, రాజబాబు ఉన్నారు.
ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వర్లుకు శ్రీనివాస్ వాయిస్ తెగ నచ్చేసింది.వెంటనే తనను తమ టీంలోకి తీసుకున్నాడు.
అనంతరం ప్రజా నాట్యమండలి ఆస్థాన గాయకుడిగా మారాడు శ్రీనివాస్.