సూర్యాపేట జిల్లా:త్వరలో జరగబోవు గ్రామపంచాయతీ సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా పోలింగ్ స్టేషన్లు వివరములపై గుర్తింపు పొందిన రాజకీయ నాయకును సలహాలు,సూచనలు మరియు అభ్యంతరాలు ఉంటే తెలుపవలసిందిగా కోరారు.
ముసాయిదా ఓటర్ల జాబితా ఎలాంటి తప్పులు లేకుండా డబుల్ ఎంట్రీ లేకుండా చూడాలని,పోలింగ్ సెంటర్లు అందరికీ అనుకూలంగా ఉండేటట్లు చూడాలని అధికారుల ఆదేశించారు.
ముసాయిదా ఓటర్ల జాబితా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో డిపిఓ నారాయణరెడ్డి,డిఆర్ డిఏ ప్రాజెక్టు అధికారి వివి అప్పారావు,ఎలక్షన్స్ సూపరిటెండ్స్ శ్రీనివాసరాజు,వేణు, ఇండియన్ కాంగ్రెస్ నుంచి రాజేశ్వరరావు,బిఆర్ఎస్ నుంచి సత్యనారాయణ, బిజెపి నుండి ఎండి అబిద్,సిపిఐ(ఎం)నుండి కోట గోపి,సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ నుండి కిరణ్, వైఎస్ఆర్సిపి నుండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.