సూర్యాపేట జిల్లా:జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన కోసం లైన్ డిపార్ట్మెంట్స్ ఒకటిగా కలిసి పని చేయాలని,ప్రతి స్కూల్, కాలేజీల్లో యాంటి డ్రగ్ కమిటీలు విద్యార్ధులతో మీటింగ్స్ నిర్వహించి,అన్ని రకాల మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే విధంగా అందరికి అవగాహన కల్పించాలని,జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు వాలంటీర్స్ తో అవగాహనా కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో మంగళవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో నషా ముక్త భారత్ అభియాన్ జిల్లా స్థాయి కమిటి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్ధులకు డ్రగ్స్ పై అవగాహనా కోసం ప్రతి స్కూల్ కాలేజీలలో పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ యొక్క అవగాహనా (ప్రచారం) కాంపెయిన్ లో ట్యాగ్ లైన్ గా “డ్రగ్ ఫ్రీ సూర్యాపేట” గా పేరు పెట్టడం జరిగినదని తెలిపారు.
అవగాహనా పోస్టర్స్ జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషినల్ ఎస్పి నాగేశ్వర్ రావు,డిఎఫ్ఓ సతీష్,డిపిఓ నారాయణరెడ్డి, ఆర్డీవోలు వేణుమాధవ్ రావు, సూర్యనారాయణ,శ్రీనివాసులు,లక్ష్మనాయక్,జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహరావు, డిఎం అండ్ హెచ్ఓ కోటా చలం,డిఈవో అశోక్,డ్రగ్ ఇన్స్పెక్టర్,డిఐఈవో భాను నాయక్,ఎలక్షన్ సూపర్డెంట్ శ్రీనివాసరాజు,సిడిపివో తదితరులు పాల్గొనారు.