జైవీర్ రెడ్డిపై నోముల భగత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు.మంగళవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్వంలో మండల కేంద్రానికి ఒక కోటి నలభై మూడు లక్షలతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేసిన ఎమ్మెల్యే కుందూరు జైవీర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

 Condemn Nomula Bhagat Inappropriate Comments On Jaiveer Reddy, Condemn, Nomula B-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ది అంటే కేవలం ఒక సంవత్సరకాలంలో తిరుమలగిరి మండలం కేంద్రం ముకుందాపురం వరకు 70 కోట్లు, అదేవిధంగా నెల్లికల్ నుంచి నడిగడ్డకు 90 కోట్లు,మరియు అటవీలో 5 రహదారులకు 12కోట్ల 70లక్షలతో అదేవిధంగా గిరిజనులకు పోడు భూములకు

పట్టాపాస్ పుస్తకాలు ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డికే దక్కుతుందన్నారు.మీరు కేవలం 2 సం కాలంలో ఫంక్షన్ల పేరుతో పబ్బం గడిపి,సంక్షేమం మీద దృష్టి పెట్టని చరిత్ర మీదన్నారు.

ఎమ్మెల్యేపై మాట్లాడే హక్కు మీకు లేదనిన్నారు.ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు రిపీట్ అయితే భవిష్యత్ లో తగిన పరిణామాలు చూస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణ నాయక్, మండల నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి,మాజీ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మేరావత్ మునినాయక్,యువజన కాంగ్రెస్ జిల్లా సహాయ కార్యదర్శి హరినాయక్, పగడాల సైదులు,శ్రీను నాయక్,వెంకటేశ్వర్లు, పాండు నాయక్,పిట్టల కృష్ణ,శ్రీరామ్,సుభాని, రాజు,గోపి,భిక్షం,సాయి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube