సూర్యాపేట జిల్లా:బొప్పారం ఐకెపి సెంటర్లో ధాన్యం ఎగుమతి చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు లారీ మీద నుండి కింద పడి రెండు చేతులు విరిగిన హమాలీ వర్కర్ సంధ నరసయ్య ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.విషయం తెలుసుకొన్న మంత్రి జగదీష్ రెడ్డి ఏరియా ఆస్పత్రికి చేరుకొని అతనితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.అతనితో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగుల్ని పరామర్శించారు.
మంత్రి వెంట జిల్లా వైద్యాధికారి ఆర్.కోట చలం,వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.