సూర్యాపేట జిల్లా:జిల్లా వ్యాప్తంగా పదికి పైగా స్ట్రీమ్ రైస్( Stream rice ) తయారు చేసే మిల్లుల నుండి గత పదేళ్లుగా స్ట్రీమ్ రైస్ ఎగుమతులు జోరుగా కొనసాగిస్తున్నారు.ఒక్కక్క నెల సుమారు లక్ష నుండి 5 లక్షల క్వింటాళ్ళ వరకు మిల్లింగ్ చేస్తుంటారు.
కానీ, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ మార్కెట్ ఫీజు,జీఎస్టీ, ఇన్కమ్ టాక్స్ లాంటివి కట్టకుండా జీరో దందా నడుపుతున్నారనేఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా( Suryapet District ) నుండి హైదరాబాద్ కు ప్రతినెల లక్షల క్వింటాళ్లో బియ్యం సప్లై చేస్తున్నా మార్కెట్ శాఖ,ఇన్కమ్ టాక్స్, జీఎస్టీ అధికారులు మామూళ్ల మత్తులో మునిగితేలుతూ రైస్ మిల్లర్ల( Rice millers ) నుండి ప్రభుత్వానికి రావాల్సిన రాబడికి భారీగా గండి కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రతినెలా లక్షల్లో చెల్లిస్తున్న కరెంటు బిల్లుల లెక్క తీస్తే మిల్లర్ల అసలు బండారం బయటపడుతుందని, క్వింటాల్ రైస్ తయారీకి రూ.50 కరెంట్ ఛార్జ్ పడుతుంది.ఈ లెక్క ప్రకారం ప్రతినెలా ఎన్ని క్వింటాళ్ళ సన్న బియ్యాన్ని తయారు చేస్తున్నారు?ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండికొడుతున్నారనే లెక్కలు క్లియర్ గా తేటతెల్లం అవుతాయని తెలుస్తుంది.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే అన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.ఒక్కొక్క మిల్లు నుండి రూ.20 కోట్ల పైగా టాక్సీ రూపంలో చెల్లించవలసి ఉంటుంది.జిల్లాలోని 10 మిల్లుల నుండి రూ.200 కోట్ల బకాయిలు ఉండొచ్చని, కొందరు అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై లక్షల్లో మామూళ్ల రూపంలో దండుకుంటూ చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని,ఇదే అదునుగా మిల్లర్లు కోట్ల రూపాయల ఆర్జిస్తూ ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టి జోరుగా జీరో దందా చేస్తున్నారని,ఈ భారమంతా సామాన్య ప్రజలపై పడుతుందని ఆయా శాఖల్లోని పలువురు కిందిస్థాయి అధికారులు చెవులు కొరుకుంటున్నట్లు సమాచారం.ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం మిల్లర్ల జీరో దందాపై సమగ్ర విచారణ జరిపి,ప్రభుత్వానికి అందాల్సిన టాక్స్ పక్కగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.