సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మొబైల్ షీ టాయిలెట్ ప్రాజెక్ట్ ను సామాజిక కార్యకర్త జలగం సుధీర్ సౌజన్యంతో ఏర్పాటు చేశారు.దీనితో పట్టణంలో మహిళలకు టాయిలెట్ ఇబ్బందులు రాకుండా చేయాలనేది ఆ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
అలాంటి ఉన్నతమైన ప్రాజెక్ట్ బిల్లుల చెల్లింపు విషయంలో కోదాడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జలగం అసొసియెట్స్ సభ్యులు లోకాయుక్తను ఆశ్రయించారు.ఈ సందర్భంగా జలగం సుధీర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ వాహనంపై షీ టాయిలెట్ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అవసరమైతే గేట్స్ – మిలిండా ఫౌండెషన్,ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ రొబొటిక్స్ సహకారంతో మూత్రం నుండి విద్యుత్ తయారిపై టెక్నాలజి సహకారం లాంటి అంశాలతో ముందుకు పోవాలనుకున్నప్పటికి కోదాడ మున్సిపాలిటి అధికారుల నిర్లక్ష్యంతో పైలట్ ప్రాజెక్ట్ నిర్వీర్యం అయిందని జలగం అసొసియెట్స్ సభ్యులు లోకాయుక్తాకు వివరించినట్లు చెప్పారు.వారి నుండి ఫిర్యాదు స్వీకరించిన లోకాయుక్త కోదాడ మున్సిపాలిటికి నోటిసులు జారీ చేసినట్లు తెలిపారు.