హెల్తీ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్స్‌..వీటిని తీసుకుంటే రోజంతా ఉల్లాస‌మే!

బ్రేక్ ఫాస్ట్ అంటే దాదాపు చాలా మంది ఇడ్లీ, వ‌డ‌, దోస‌, పూరి, ఉప్మా, చ‌పాతీ వంటి వాటినే ఎక్కువ‌గా చేసుకుని తీసుకుంటారు.

అయితే బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వారికి మాత్రం వీటిని చేసుకుని తినే స‌మ‌యం లేక బ‌య‌ట దొరికే పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు కొనుగోలు చేసుకుని క‌డుపు నింపుకుంటారు.

కానీ, ఇటువంటి ఫుడ్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.ఊబ‌కాయం, డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వంటి అనారోగ్య స‌మస్య‌లు ద‌రి చేర‌డానికి ఇటువంటి ఫుడ్సే కార‌ణం అవుతుంటాయి.

అందుకే బిజీ లైఫ్ షెడ్యూల్ ఉన్న వారు పిజ్జాలు, బ‌ర్గ‌ర్ల‌కు బ‌దులు ఇప్పుడు చెప్పబోయే హెల్తీ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్స్‌ను తీసుకుంటే రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు.మ‌రి ఆల‌స్య‌మెందుకు ఆ బ్రేక్‌ఫాస్ట్స్‌ ఏంటో ఓ చూపు చూసేయండి.

వెజ్‌టేబుల్ ఆమ్లెట్‌: దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా అంటే చాలా సుల‌భం.మీకు న‌చ్చిన‌ కూర‌గాయల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసుకుని.

Advertisement

వాటిలో రెండు ఎగ్స్‌, సాల్ట్‌, పెప్ప‌ర్ పౌడ‌ర్ మిక్స్ చేసి ఆమ్లెట్ వేసుకుని తినొచ్చు.వెజ్‌టేబుల్ ఆమ్లెట్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఆక‌లి తీర‌డ‌మే కాదు.

శ‌రీరం డే మొత్తం యాక్టివ్‌గా ఉండేందుకు కావాల్సిన బోలెడ‌న్ని పోష‌కాలు ల‌భిస్తాయి.ఓట్స్‌: హెల్తీ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది ఒక‌టి.ఒక గిన్నెలో అర క‌ప్పు ఓట్స్‌, గ్లాస్ వేడి పాలు, ఒక స్పూన్ తేనె, కావాలి అనుకుంటే ఏమైనా పండ్ల ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి తీసుకోవ‌చ్చు.

ఓట్స్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, అల‌స‌ట వంటివి దూరం అవుతాయి.బ‌రువు త‌గ్గుతారు.మ‌రియు అతి ఆక‌లి త‌గ్గుతుంది.

అరటి షేక్: ఆరోగ్య‌వంత‌మైన బ్రేక్‌ఫాస్ట్‌గా అర‌టి షేక్‌ను కూడా ప‌రిగ‌ణించవ‌చ్చు.పైగా దీని త‌యారీకి పెద్దగా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని లేదు.బ్లెండ‌ర్‌లో బాగా పండిన అర‌టి పండ్లు రెండు, ఒక గ్లాస్ పాలు, మూడు వాల్ న‌ట్స్‌, రెండు బాదం ప‌ప్పులు, ఒక స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్‌, కొద్దిగా తేనె వేసి బ్లెండ్‌ చేసుకుంటే అర‌టి షేక్ సిద్ధ‌మైన‌ట్టే.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ రుచిక‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకుంటే రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండొచ్చు.ఇక ఇవే కాకుండా ఆకుకూర‌ల‌తో త‌యారు చేసే స‌లాడ్స్‌, స్ప్రౌట్స్ ఛాట్‌, పండ్ల ముక్క‌లు, స్మూతీలు వంటి వాటిని కూడా బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవ‌చ్చు.

Advertisement

వీటిని త‌యారు చేసుకోవ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌క‌పోయినా.ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి.

తాజా వార్తలు