బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి కత్రినా కైఫ్ ( Katrina Kaif ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బాలీవుడ్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి ఈమె తాజాగా సల్మాన్ ఖాన్( Salman Khan ) హీరోగా నటించిన టైగర్ 3 ( Tiger 3 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబడుతుంది.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కత్రినా కైఫ్ తన గురించి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ తాను ఇదివరకు నా జీవితంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన చూశానని చావు అంచు వరకు వెళ్లి బ్రతికి బయటపడ్డానంటూ ఈమె కామెంట్ చేశారు.ఒకసారి తాను హెలికాఫ్టర్ లో ప్రయాణం చేస్తూ ఉండగా హెలికాప్టర్లో ఏదో సమస్య తలెత్తింది.దాంతో ఒక్కసారిగా కంగారు పడ్డానని హెలికాప్టర్ ప్రమాదం కారణంగా అది చాలా వేగంగా నేల వైపు దూసుకు వస్తుంది.అది చూసి నేను ఈరోజు చనిపోవడం ఖాయం నా చావు ఏంటి దేవుడా ఇలా రాశావు అంటూ బాధపడ్డాను ఇక నాకు ఏమైనా నా తల్లితండ్రులు ధైర్యంగా ఉండాలని మాత్రమే ఆ క్షణం కోరుకున్నాను.

ఇలా వేగంగా హెలికాఫ్టర్ ( Helicopter ) దూసుకు రావడంతో నాకు చాలా భయం వేసిందని ఇంత ఘోరంగా చనిపోబోతున్నాను ఏంటి దేవుడా అంటూ ప్రార్థించాను అయితే భగవంతుని దయతో హెలికాప్టర్ ప్రమాదంలో నాకు స్వల్ప గాయాలు తగిలాయి తప్ప ప్రమాదం జరగలేదని ఇలా ఆ క్షణం భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకున్నానని కత్రినా కైఫ్ వెల్లడించారు.చావు అంటే ఎలా ఉంటుందని చావు అంచుల వరకు వెళ్లి వెనక్కి వచ్చాను అంటూ ఈమె ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక కత్రినా నటుడు విక్కీ కౌశల్( Vicky Kaushal ) ను పెళ్లి చేసుకున్నప్పటికీ ఇండస్ట్రీలో వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.







