చైనాలో అద్భుతమైన దృశ్యం.. టియాన్‌లాంగ్ పర్వతంపై అబ్బురపరిచే మూడు అంతస్తుల వంతెన!

చైనాలోని( China ) మూడు అంతస్తుల అద్భుతమైన వంతెన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్ల వ్యూస్, లక్షల్లో లైక్‌లు వచ్చాయి.

 China Three-storey Bridge Over Tianlong Mountain Video Viral Details, Tianlong M-TeluguStop.com

తైయువాన్ నగరానికి సమీపంలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని టియాన్‌లాంగ్ పర్వతంపై( Tianlong Mountain ) ఉన్న ఈ వంతెన టియాన్‌లాంగ్‌షాన్ హైవేలో ఒక భాగం.దీనిని “హైవే అబౌ ది క్లౌడ్స్”( Highway Above The Clouds ) అని కూడా పిలుస్తారు.

ఈ వంతెన 350 మీటర్ల ఎత్తు, 30 కిలోమీటర్ల పొడవుతో పర్వతంపై విస్తరించి ఉంది, ఇది మేఘాల మీదుగా ఎగురుతున్న ఒక పెద్ద డ్రాగన్‌ను పోలి ఉండే అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది.

బలమైన గాలులు, భూకంపాలను తట్టుకోగల బాక్స్-గార్డర్ నిర్మాణాన్ని నిర్మించడానికి సుమారు ఏడు వేల టన్నుల ఉక్కును ఉపయోగించారు.ఈ వంతెన మోడర్న్ ఇంజనీరింగ్‌కు( Modern Engineering ) ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు.వంతెన ప్రత్యేకమైన వృత్తాకార డిజైన్( Circular Design ) డ్రైవర్లు పర్వత దృశ్యాలను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది, అదే సమయంలో పర్యావరణ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.

ఈ వంతెన పర్యాటకులకు, స్థానికులకు ఒక పాపులర్ డెస్టినేషన్‌గా మారింది, ఇక్కడ ఆకాశమంత హైవేపై డ్రైవింగ్ చేసే థ్రిల్‌ను అనుభవించడానికి తరలివస్తారు.

వంతెన వైరల్ వీడియోను @Enezator ఎక్స్ యూజర్ పోస్ట్ చేసారు, అతను వంతెన అద్భుతమైన అందాన్ని వివిధ కోణాల నుంచి రికార్డ్ చేశాడు.చాలా మంది వినియోగదారులు ఈ ఇంజనీరింగ్ ఫీట్‌ను ప్రశంసించారు.వంతెన రూపకల్పన, స్థిరత్వం పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

కొంతమంది వినియోగదారులు ఈ వంతెన చైనా అధునాతన మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలకు నిదర్శనమని పేర్కొన్నారు.ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్, క్రియేటివిటీకి చిహ్నంగా మారిన టియాన్‌లాంగ్ మౌంటైన్ బ్రిడ్జ్ ను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube