సూర్యాపేట జిల్లా: జిల్లాలో సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సైబర్ నేరాలపై సైబర్ పని చేస్తున్న సెక్యూరిటీ పోలీసు విభాగం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు శనివారం జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా సైబర్ మోసాలపై సమాచారం అందగానే కేసులు నమోదు చేసి నగదు బదిలీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, పోయిన డబ్బును కోర్టుల సహాయంతో బాధితులకు అందేలా కృషి చేస్తున్నామని జిల్లా జడ్జికి డిఎస్పీ శ్రీనివాసరావు వివరించారు.
ఈ కేసుల్లో నగదు త్వరగా బాధితులకు చేరేలా వేగంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ నాణ్యమైన దర్యాప్తు చేసి సకాలంలో కేసు అభియాగ పత్రాలను కోర్టుకు అందించాలని సూచించారు.
లోక్ అదాలత్ లను సద్వినియోగ చేసుకుని త్వరగా కేసులు పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని చెప్పారు.అనంతరం పోలీసు కార్యాలయం నందు సైబర్ వారియర్ పోలీసు సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతి నిర్వహించి జాతీయ,రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నంబర్ లు,వెడ్ సైట్స్ ద్వారా వచ్చే ఫిర్యాదులు,పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిశీలిస్తూ కేసుల నమోదు,దర్యాప్తు వేగంగా చేసి బాధితులకు భరోసా కల్పించాలన్నారు.
పోలీసు వారియర్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ మోసాలపై ప్రజలను చైతన్య పరిచి,నేరాలు జరగకుండా కృషి చేయాలన్నారు.