సూర్యాపేట జిల్లా:గిరిజన హాస్టల్లో మెరుగైన పౌష్టికాహారం అందించాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్య రవి నాయక్, ఉపాధ్యక్షులు ధరావత్ నాగేందర్ నాయక్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు గిరిజన హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో నల్లగొండ జిల్లా దామరచర్లలోని గిరిజన హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఎంతోమంది విద్యార్థునిలు అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని పలు గిరిజన హాస్టల్లో ఉన్న వసతులను పరిశీలించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థునిలకు అందుతున్న ఆహారాన్ని అడిగి తెలుసుకున్నారు.అధికారులు అప్రమత్తంగా ఉండి విద్యార్థునిలకు మెరుగైన ఆహారాన్ని అందించాలన్నారు.
దామరచర్ల లాగా మరే ఇతర హాస్టల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజు నాయక్,గాంధీ నాయక్,శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.