యూరోప్ కంట్రీ లాట్వియాలో ఓ వీరోచిత రెస్క్యూ వెలుగు చూసింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరలవుతోంది.
ఒక లాట్వియన్ ఫైర్ ఫైటర్ ఒక సూపర్ హీరో లాగా ప్రవర్తించి సూసైడ్ అటెంప్ట్ చేసిన ఒక యువతిని కాపాడాడు.ఈ రెస్క్యూ క్లిప్ ని తోటి ఫైర్ ఫైటర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వివరాల్లోకి వెళితే.లాట్వియాలో ఒక యువతి ఆత్మహత్య చేసుకునేందుకు నాల్గవ అంతస్తులోని కిటికీ చివరికి చేరుకుంది.
అయితే దీనిని గమనించిన స్థానికులు ఆమె అక్కడి నుంచి దూకబోతోందని అనుమానించారు.అనంతరం టోమస్ జాన్‌జెమ్స్ అనే ఫైర్ ఫైటర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందగానే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లారు.అయితే యువతి ఉన్న రూమ్ డోర్ లాక్ కావడంతో ఆమెను ఎలా కాపాడాలో తెలియక ఆలోచనలో పడిపోయారు.
ఆ తర్వాత వారికి ఒక ఐడియా వచ్చింది.అదేంటంటే, మహిళా ఉన్న రూమ్ కి సరిగ్గా కింద ఉన్న మూడవ అంతస్తులోని రూమ్ కి వెళ్లడం.
ఆ తర్వాత మూడవ అంతస్తు కిటికీ నుంచి ఆమెను కాపాడటం.
అయితే ఇది వినడానికి చాలా ఈజీగా అనిపించినా కిందకి దూసుకొస్తున్న యువతిని క్యాచ్ పట్టడం చాలా కష్టం.కానీ ఫైర్‌మెన్ ఆమె ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు.అతను ధైర్యం చేసి క్యాచ్ పట్టుకునేందుకు కరెక్ట్ పొజిషన్ తీసుకున్నాడు.
ఇంతలోనే ఆ యువతి కిందికి దూకింది.అలా కింద పడుతున్న ఆమెను గాల్లోనే క్యాచ్ పట్టాడు.
అలా ఆమె ప్రాణాలను రక్షించాడు.అయితే ఈ సమయంలో మరొక ఫైర్‌మెన్ అతను బ్యాలెన్స్ తప్పకుండా కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు.
దీంతో ఈ రెస్క్యూ సక్సెస్ అయ్యింది.ఈ హీరోయిక్ రెస్క్యూ వీడియోని మీరు కూడా చూసేయండి.