బోరుబావుల కింద యాసంగి నాట్లు - చాలీచాలని నీటితో పాట్లు

సూర్యాపేట జిల్లా: నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద గల హుజూర్ నగర్ పరిధిలో యాసంగి నాట్లు జోరందుకున్నాయి.సన్న రకం ధాన్యానికి ఆశాజనకమైన ధర ఉండటంతో రైతులు ధైర్యం చేసి చిన్నపాటి బోర్లుబావులు కింద నాట్లు మరియు డ్రం సీడ్స్ వేస్తున్నారు.

 Yasangi Plants Under Borewells With Water Scarcity In Suryapet District, Yasangi-TeluguStop.com

ఇప్పటికైతే బోర్ బావుల ద్వారా సాగు చేసుకుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం నాగార్జునసాగర్ నుంచి ఒకటి లేదా రెండుసార్లు నీళ్లు విడువక పోతారా అని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అప్పటివరకు ఏదో తిప్పలపడి కొద్దిగా వరి పంట సాగు చేసుకుంటామని,తమకు అదే జీవనాధారమని రైతులు చెబుతున్నారు.

కానీ,చాలీ చాలని నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటామేమోనని ఆందోళన చెందుతున్నారు.అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ పై గంపెడు ఆశలు పెట్టుకొని సాగులోకి దిగుతున్నమని,యాసంగి సాగు నుండి తమను గట్టేకించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube