సూర్యాపేట జిల్లా: కార్మిక వ్యతిరేకి నరేంద్ర మోడీని సాగనంపూ దామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అన్నారు.దేశవ్యాప్తంగా రెండు రోజులపాటు జరుగుతున్న మహాపడావ్ (మహా ధర్నాలు) కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్డీవో కార్యాలయం ముందు ఏఐటీయూసీ, సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన, స్వతంత్ర్యానికి పూర్వమే సంపాదించుకున్న 42 రకాల కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దుచేసి మిగిలిన చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి పెట్టుబడిదారీ విధానాలకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం,దాని నాయకుడు నరేంద్ర మోడీని సాగనంపే సమయం ఆసన్నమైందని అన్నారు.
దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుతున్న ధరలు నియంత్రించడంలో నరేంద్ర మోడీ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్రంలో జరుగుతున్న సెకండ్ ఏఎన్ఎం పోస్టులను రెగ్యులర్ చేయాలని,అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం ఏర్పాటు చేసి జీవిత బీమాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.దేశంలో మత విధ్వంసం రెచ్చగొడుతున్న బీజేపీ మతోన్మాద పార్టీని గద్దె దింపాలని పిలుపునిచ్చారు.
అనంతరం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మిట్టగడుపుల ముత్యాలు,ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే.
లతీఫ్,జిల్లా సహాయ కార్యదర్శి జీవి రాజు, కోదాడ హమాల్ యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి పోతురాజు సత్యనారాయణ,బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రాఘవరెడ్డి, నాగరాజు,మేడే నాగార్జున ఏ.శ్రీనివాస్, సత్యనారాయణ,రవి, నాగుల్ మీరా, కోటేశ్వరరావు,ఐలయ్య, బ్రహ్మం,అరవింద్,మోసిన్, సాయికుమార్, వేంకటేశ్వర్లు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.