యాదాద్రి భువనగిరి జిల్లా: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు రీ – అలాట్మెంట్ ఆర్డర్స్, జూనియర్ పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్ ను గురువారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, జెడ్పీ చైర్మన్,సందీప్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.







