సూర్యాపేట జిల్లా: పోలీస్ సిబ్బంది అంకిత భావంతో పని చేసినప్పుడే,గుర్తింపు లభిస్తుందని,సిబ్బంది సమస్యలను అడిగి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.గురువారంతుంగతుర్తి పోలీస్ స్టేషన్లోని సర్కిల్ కార్యాలయాన్ని అయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డుల పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ
గ్రామాల్లోని ప్రజలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండి, పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్,ఎస్సై డానియల్ కుమార్,వెంకన్న,ప్రసాద్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.