కబ్జాలపై గళమెత్తిన హుజూర్ నగర్ కౌన్సిలర్లు

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ మున్సిపాలిటీలో శుక్రవారం బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో మున్సిపాలిటీ పరిధిలో కబ్జాకి గురవుతున్న లేఔట్ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నల్ల దుస్తులు, బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ప్రధాన ద్వారం ముందు ఆందోళనకు దిగారు.

 Councilors Of Huzur Nagar Who Are Upset About Possessions, Huzur Nagar, Kastala-TeluguStop.com

దీనికి ప్రతిపక్ష కౌన్సిలర్లు మద్దతు పలికారు.మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.

అనంతరం ఆందోళన చేపట్టిన కౌన్సిలర్లు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని వీపిఆర్ వెంచర్ లో మున్సిపాలిటీ కేటాయించిన రెండు వేల మూడు వదల గజాల స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.కబ్జాకి గురవుతున్న మున్సిపాలిటీ లేఅవుట్ స్థలాలను కబ్జా కోరల నుండి విడిపించి ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేసి కాపాడాలని కోరారు.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జక్కుల వీరయ్య.

కోతి సంపత్ రెడ్డి,శ్రవణ్, మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube