నేరేడుచర్ల పి.హెచ్.సిని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండల( Nereducharla) కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటా చలం గురువారం ఆకస్మికంగా సందర్శించారు.ల్యాబ్,ఫార్మసీ,రిజిస్టర్లు,పరిసరాలు పరిశీలించి తనిఖీ చేశారు.

 Dmho Conducted Surprise Inspection Of Nereducharla Phc, Dmho , Nereducharla Ph-TeluguStop.com

అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశా కార్యకర్తలకు సూచించారు.

ప్రస్తుతం ఒకసారి జ్వరం వచ్చిన వాళ్లకి,రెండవసారి జ్వరాలు వస్తున్నాయని, హాస్పటల్ సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.విధులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల పిహెచ్ సి వైద్యాధికారిణి పున్న నాగిని,హాస్పటల్ డాక్టర్లు,సిబ్బంది,ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube